ఇంజినీరింగ్ పై తగ్గిన మోజు…

125

THE BULLET NEWS (EDUCATION)-ఇంజినీరింగ్, బీ ఫార్మా, ఫార్మా డీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తయింది… 67,325 సీట్లకు గాను…  52,774 సీట్లు భర్తీ అయ్యాయి… ఇక ఇంజనీరింగ్ కాలేజీల్లో 12,325 సీట్లు మిగిలిపోయాయి… బీ ఫార్మసీలో 2,229 సీట్లకి 120 మాత్రమే భర్తీ కాగా… 81 ఇంజనీరింగ్ కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీఅయినట్టు అధికారులు ప్రకటించారు. 45 కళాశాలల్లో 100 లోపు మాత్రమే భర్తీ కాగా… ఓ కాలేజీకి ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు.

మొత్తం ఎంసెట్‌లో 96,703 మంది విద్యార్థులు క్వాలిఫై అయితే… సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి హాజరైంది మాత్రం 59,033 మందే… ఇక ఆప్షన్స్ ఇచ్చింది 58,048 మంది ఇచ్చారు. ఇంజనీరింగ్ లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 64, 946 ఉంటే ఇందులో 52, 621 సీట్లు కేటాయించారు. 81 శాతం సీట్లు కేటాయింపు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సీట్ వచ్చిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది… కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు అధికారులు. అయితే ఇప్పుడు వచ్చిన సీట్, కాలేజీ ఇష్టం లేకుంటే రెండో విడత కౌన్సెలింగ్ లో మార్చుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు 5,274 విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకున్నా సీట్లు కేటాయించలేదు.

SHARE