దాదాపు 24 గంటల నుంచి నిలిచిన కరెంట్ సరఫరా…

122

THE BULLET NEWS (KOVUR):-నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు టౌన్ మరియు కోవూరు రూరల్ లోని పలు ప్రాంతాల్లో దాదాపు 24 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది…

కరెంట్ స్థంభం పై టెంకాయ చెట్టు పడటంతో విద్యుత్ స్థంభం నేలకు ఒరిగింది…

స్థానికులు సమాచారం తో వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బంది నిన్న మధ్యాహ్నం 4 గం లకు వచ్చిన వారు దాదాపు 24 గం లు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరించడంతో మరమ్మతులు పనులు నత్తనడకన చేస్తున్నారు…

కరెంటు సరఫరా లేకపోవడంతో స్థానికులు కోవూరు రూరల్ విద్యుత్ శాఖ అధికారిని ప్రశ్నించగా అది నాకు సంబంధించినది కాదు అని సమాధానం ఇచ్చారు.. మా కరెంట్ బిల్లు లో రూరల్ అని ఉన్నప్పటి కి సంబంధిత అధికారి అలా చెప్పడం ఎంత వరకు సబబు స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.కరెంట్ సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…

SHARE