పడుగుపాడులో అద్వాన్నంగా పారిశుధ్యం.. పట్టుంచుకొని అధికారులు..

94

THE BULLET NEWS (PADUGUPADU)-నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలో రోజు రోజుకూ పారిశుద్ధ్యం క్షీణించి పోతున్నా ఆ శాఖ అధికారులు కనీసం పట్టించుకున్న దాఖ లాలు లేవు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్యం మరింత అధ్వాన్నంగా తయారైంది. గత నెల రోజుల నుంచి వీధి కాలువల మరుగు తియ్యని కారణంగా మురుగునీరు రోడ్ల పైన పారుతుంది. ఏ సందులో చూసినా చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. మురుగు రోడ్లపైన నిల్వ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. మెయిన్‌ రోడ్డుపైన కూడా చెత్త కుప్పలు దర్శనం ఇవ్వడంతో ముక్కు మూసుకుంటున్నారు. అధికారులు ఎన్ని వారోత్సవాలు చేసినా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో మరీ దారుణంగా తయారైంది. అధికారుల నిర్వాకానికి పారిశుద్ధ్యం పట్టణంలో తాండవిస్తుంది. దీంతో పట్టణమంతా కంపుకొడుతుందని పలువురు వాపోతున్నారు. అధికారులు ఇంత జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో అస్తవ్యస్తంగా పంచాయతీ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే అంటురోగాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పంచాయతీ అధికారులు చొరవ చూపి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు. మరో పక్క దోమలు విజ్రంభిస్తున్నారు.. ఇంటి పన్నులు వసూలు చేసే శ్రద్ధ.. పారిశుద్ధ్యం, దోమల నియంత్రణ మీద పెట్టాలని పడుగుపాడు వాసులు డిమాండ్ చేస్తున్నారు..
ఇవన్ని ఒకటైతే ఇంటి పనులు వసూల్ చెయ్యడంలో మాత్రం తొందర చూపుతున్నారు.. పన్నులు చెల్లించందంటూ గుక్క తిప్పుకొనివ్వకుండా.. ముక్కు పిండి మరీ వసూల్ చేస్తున్నారు..పారిశుద్ధ్యo గురించి అడిగితే మాత్రం.. ఆఫీస్ కి వెళ్లి అడగాలని జవాబు ఇస్తున్నారు.. ప్రజలు ఆఫీస్ కి వెళ్లి పిర్యాదు చేస్తేనే తప్ప పారిశుద్ధ్యo అంటూ ఒకటి ఉంది అని విషయం పంచాయతీ అధికారులకు గుర్తు రావడం లేదు.

SHARE