నా వెనక ఎవరు లేరు…

27

THE BULLET NEWS (CHENNAI)-కొత్త పార్టీ, జెండా, ఎజెండా ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నారు. ఏప్రిల్ 14న పార్టీ జెండా ఆవిష్కరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. హిమాలయాల్లో ఆధ్మాత్మిక యాత్ర ముగించుకుని చెన్నైకి చేరుకున్న రజనీ మీడియాతో మాట్లాడారు. హిమాలయ యాత్ర తనలో కొత్త శక్తి ఇచ్చిందని పేర్కొన్నారు. తన వెనక బిజెపి ఉందన్న వార్తలను రజనీ ఖండించారు. తన వెనక ద్రవిడ పార్టీలు, వ్యక్తులు ఎవరూ లేరని తాను స్వయంగా ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. రామరాజ్య రథయాత్ర కారణంగా మత విద్వేషాలు చెలరేగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రజనీకాంత్‌ స్పష్టం చేశారు.

SHARE