The bullet news ( Nellore) _ విజ్ఞత ఉన్న ఏ నాయకుడు చంద్రబాబు వంటి అవినీతి పరుడికి అప్పాయింట్ మెంట్ ఇవ్వరని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.పార్లమెంటు మొదటి అంతస్థు నుంచి ఆయన ప్రత్యేక హోదా ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లాగా తాను అవినీతి పరుడిని కానని అన్నారు. ఓటు కు నోటు కేసు నుంచి తప్పించాలని కోరడానికే మోడీని చంద్రబాబు అడిగారని,అందుకు ఆయన ఒప్పుకోకుండా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని విజయసాయి వ్యాఖ్యానించారు.రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం నాది అని చెప్పకునే చంద్రబాబు… 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని వాపోవడం ఆయనకు క్రెడిబులిటీ, క్యారెక్టర్‌ లేదనడానికి నిదర్శనం అని ఆయన ద్వజమెత్తారు.

SHARE