జేడీఎస్‌తో పొత్తుండదు: బీజేపీ

77

THE BULLET NEWS (KARNATAKA)-ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ ఆధిక్యాలు వెలువడుతుండగా మరోవైపు బీజేపీ నేతలు సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే 112 సీట్లు దాటేశామని, జేడీఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ సీనియర్ నేత సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు, బీజేపీ లీడింగ్‌లో ఉందంటూ ట్రెండ్స్ వెలువడుతుండటంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని విజయ నినాదాలు హోరెత్తిస్తున్నారు.

SHARE