నో రూల్స్… నో స్పీడ్ లిమిట్స్… ఇష్టానుసారంగా ట్రాక్టర్ లు నడుపుతున్న మైనర్ లు…

239

THE BULLET NEWS (KOVUR):-మోటార్‌ వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ ప్రచారం చేస్తున్న ఎవరు పటించుకోవడంలేదు… మైనర్ లు ద్విచక్రవాహనలు నడపడమే తప్పు అన్ని చెపుతుంటే ఇక్కడ ఏకంగా ట్రాక్టర్ లే నడుపుతున్నారు… అందులోనూ మితిమీరిన వేగంగా వాహనాలు నడుపుతూ స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు… స్థానికులు రోడ్లపై నడిచేందుకు భయపడుతున్నారు…

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం లోని ముదివర్తి లో ఇసుక రవాణా జరుగుతుంది…జిల్లా నలుమూలలకు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంది.

కోవూరు, విడవలూరు ప్రాంతంలో రోడ్లు చిన్నవిగా ఉన్నపటికీ ట్రాక్టర్ లు స్పీడ్ లిమిట్ ను అనుసరించకుండా అధిక స్పీడ్ లో వెళ్తున్నారు…ఇంకా మైనర్ డ్రైవర్ ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు… అధిక స్పీడ్, అధిక లోడ్ తో వాహనాలు నడుపుతుంటారు…స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పటించుకోవడంలేదు అన్ని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

SHARE