కార్పొరేషన్ గోడలు @ సులబ్ కాంప్లెక్ గోడలు…

137

THE BULLET NEWS (NELLORE)-స్వచ్ఛ నెల్లూరు.. నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుదాం… అంటూ ప్రతి రోజు డబ్బా కొట్టే నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారుల వారి చిత్తశుద్ధి ఏంటో మరోసారి బయటపడింది..స్వచ్ నెల్లూరులో మీరంతా భాగస్వాములు కావాలంటూ చెప్పే కార్పొరేషన్ అధికారులు మాత్రం వాళ్ళ ఆఫీస్ ను శుభ్రం చేసుకోవడం మాత్రం తెలీదు..

బుల్లెట్ న్యూస్ పరిశీలన లో బయటపడ్డ విషయాలు..

ఇవిగో ఈ ఫొటోస్ మిరే చూడండి.. గోడమీద పాన్ మరకలు, గుట్కా తుపర్లు, ఆఫీస్ ప్రాంగణంలో అపరిశుభ్రతను చూసిన జనాలు అసహ్యించు కుంటారు..సినిమా హాల్లో కూడా పాన్ అనుమతించడం లేదు.. అలాంటిది కార్పొరేషన్ లో పాన్ మరకలు ఉండటం చూసిన జనాలు ఆఫీస్ నే శుభ్రపరుచుకోలేని వీరు స్వచ్ నెల్లూరు అని నినదించడం నవ్వు తెప్పిస్తోందని చర్చించుకుంటున్నారు.
మునిసిపల్ సిబ్బంది ఉండే ప్రధాన కార్యాలయంలో గోడలపై పాన్ తుపర్లు, పరిసరాల్లో అపరిశుభ్రత దర్శనమిస్తోంది..
నెల్లూరు కార్పొరేషన్ పెద్ద తోపు అంటూ టివిలో, పేపర్స్ లో డబ్బాలు కొట్టడం మానేసి ఆఫీస్ ను శుభ్రంగా ఉంచుకోవాలని నగర ప్రజలు సూచిస్తున్నారు.. సాయంత్రం 7 దాటితే కార్పొరేషన్ ప్రాంగణంలో లైట్స్ కూడా వెలగడం లేదు.. సొంత కార్యాలయంలో ని పరిసరాలను శుభ్రపరచలేని మునిసిపల్ అధికారులు…
వార్డు లోని చెత్త ఎలా శుభ్రపరుస్తున్నారో అంటూ పెదవి విరుస్తున్నారు.. పోని పనితీరు అయినా సక్రమంగా ఉందా అంటే ఆఫీ కూడా లేదు.. ఏ పని కావాలన్నా పైసలు ఉండాలసిందే.. దానికి తోడు అక్కడ కొన్ని పత్రికల వారే రాజ్యమేలుతుంటారు.. మిగతా వారు చిన్న సమాచారానికి వెళ్లినా రేపు రండి అంటూ ఏసీల్లో కూర్చుకుని హ్యాపీగా సమాధానం చెబుతారు. ఎప్పటికి కార్పొరేషన్ బాగుపడుతుందో ఏమో..

SHARE