అధికారం లేదు.. అభివ్రుద్ది చేయాలనే తపనుంది.. – మంజూరైన నిధుల వివరాలు తెలిపిన ఎమ్మెల్యే కాకాణి

64

The bullet news (Sarvepalli)- తమ చిరకాల కోరిక ఎప్పుడు తిరుతుందోనని కొందరు.. ఎప్పుడు తమకు రోడ్లకు దశ తిరుగుతుందోననే మరికొందరు.. కళ్లముందు అసంపూర్తి రోడ్లు.. ఏళ్లు గడుస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడంలేదనే బాధ ఇంకొందరిది.. వీటన్నింటికి ఎమ్మెల్యే కాకాణి క్రుషి సమాధానం చెప్పింది.. తన నియోజకవర్గంలో తాను స్వయంగా పర్యటించిన సందర్భంలో ఆయన గుర్తించిన రోడ్ల నిర్మాణాలకు దగ్గరుండి నిధులు మంజూరు చేయించారు.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా కొన్ని అయితే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఇంకొన్ని ఇలా.. సర్వపల్లి నియోజకవర్గంలో 5 కోట్ల 63 లక్షలు నిధులు మంజూరయ్యాయి..

మంజూరైన రోడ్లలో కొన్ని కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్లయితే.. మరికొన్ని గ్రామాలకు కొత్తగా రోడ్లు
వేయనున్నారు.. వీటితో పాటు త్వరలోనే మరికొన్ని రోడ్లు తన ద్రుష్టికి వచ్చాయని వాటికి కూడాత్వరలోనే నిధులు
మంజూరయ్యేలా చూస్తానన్నారు..

గ్రామీణాభివ్రుద్ది శాఖ ద్వారా మంజూరైన రోడ్ల వివరాలు..

* పొదలకూరు మండలంలోని ఆదూరుపల్లి- ఓబులాయపల్లి రోడ్డు నుంచి చెన్నారెడ్డిపల్లి ఎస్సీ కాలనీ వరకు 4.5 కిలోమీటర్ల
దూరానికి గానూ 90లక్షల నిధులు మంజూరు చేశారు..
* టీపీ గూడూరులో మండలం నరుకూరు- టీపీ గూడూరు రోడ్ నుంచి వయా పాపిరెడ్గిపాలెం మీదుగా చిన్నచెరుకూరు-
కాకుపల్లి రోడ్డు 4.81 కిలోమీటర్ల దూరం కల్గిన ఈ రోడ్డికి 70లక్షల నిధులు మంజూరయ్యాయి..
* టీపీ గూడూరు మండలం చిన్నపాలెం నుంచి కొత్తపాలెం వరకు 3.59 కిలోమీటర్ల దూరమున్న ఈ రోడ్డు నిర్మాణం కోసం
70లక్షల మంజూరు అయ్యాయి..

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద మంజూరైన రోడ్ల వివరాలు..
* పొదలకూరు మండలంలోని నావూరు ఎస్సీ కాలనీకి 1.20 కిలోమీటర్ల దూరానికి 85లక్షల నిధులు మంజూరు
అయ్యాయి.. ఈ ఎస్సీ కాలనీకి రోడ్డు లేన ఇక్కడి ప్రజలుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునేవారు.. వీళ్ల సమస్యను గుర్తించిన
ఎమ్మెల్యే రోడ్డు వేయించే బాధ్యత నాదంటూ ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా నిధులు మంజూరు చేయించారు..
* ముత్తుకూరు మండంలోని వరకవిపూడి నుంచి వయా ఆముదాలపాడుమీదుగా ఉన్న 1.60 కిలోమీటర్ల దూరానికి
115.00 లక్షల నిధులు మంజూరయ్యాయి.. ఈ రోడ్డను నిర్మించడం వల్ల ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం
అవ్వనున్నాయి..
* మనుబోలు మండలంలొని మనుబోలు- పొదలకూరు రోడ్డు నుంచి జట్లకొండూరు ఎస్సీ కాలనీ వరకు అసంపూర్తిగా
వదిలేసిన 0.80 కిలోమీటర్ల రోడ్డుకు దశ తిరిగింది.. అక్కడి స్థానికులు, వైసీపీ నాయకుడు తులసీ యాదవ్ ఎమ్మెల్యేను
కలిసి ఆ రోడ్డు దుస్థితిని గురించి వివరించారు.. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కాకాణి ప్రతిపాదనలను సిద్దం చేసి నిధులు
మంజూరు చేయించారు.. ఎస్సీ కాలనీ రోడ్డుకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకి తులసీ యాదవ్ అభినందనలు
తెలిపారు..
*ముత్తుకూరు మండలంలోని ముత్తుకూరు రోడ్డు నుంచి మామిడిపూడి ఎస్సీ కాలనీ వరకు అసంపూర్తిగా ఉన్న0.20
కిలోమీటర్ల రోడ్డుకు 62లక్షల నిధులు మంజూరయ్యాయి..
* ముత్తుకూరు మండలంలోని దరువుల పాలెం పంచాయతీ వెంకన్నపాలెం ఎస్సీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు 0.6
కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 36 లక్షల నిధులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి మంజూరయ్యాయి..
కాకాణి స్పందన :
ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ అధికారం లేకపోయినా.. అభివ్రుద్ది చేయాలనే తపన, ప్రజా సమస్యలను అర్దం చేసుకునే
స్వభావం వాటికి తోడు క్రుషి ,పట్టుదల ఉంటే గ్రామాల అభివ్రుద్ది సాధ్యమన్నారు.. ప్రస్తుతానికి కొన్ని గ్రామాలకే నిధులు
మంజూరయ్యయాయని.. తాను గ్రామాల సందర్శన సమయంలో గుర్తించిన ప్రతి సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరించేందుకు
తాను సిద్దంగా ఉన్నారన్నారు..

SHARE