చదువే కాదు.. క్రీడలు కూడా ముఖ్యమే.. – సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త రాజా

112

THE BULLET NEWS -జీవితానికి చదువు ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని సర్వేపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త, యువ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.. అల్లీపురంలోని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెమోరియల్ జెడ్పీ హైస్కూలులోని క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు చాలా ఉపయోగం అన్నారు.. శారీరిక, మానసిక ఉల్లాసాన్ని అవి దోహదపడుతాయన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి అల్లీపురం ప్రతిష్టను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు..

SHARE