ఇప్పుడు.. రేపు. 2019.. ఎప్పుడైనా నేనే వైసీపీ అభ్య‌ర్దిని.. ముందు నువ్వు రాజీనామా చేసి రా చూసుకుందాం – వైసీపీ వెంక‌టగిరి ఇన్ చార్జి బొమ్మిరెడ్డి

261

The bullet news (Venkata Giri)_ ముందు నువ్వు రాజీనామా చేసి రా.. నేను సిద్దంగానే ఉన్నా..ఇప్పటికి ఇప్పుడే ఎన్నికలకు వెళ్దాం.. నువ్వు నేనో తేల్చుకుందామంటూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ కృష్ణ చేసిన స‌వాల్ పై ఆ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్ చార్జి, జడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి ఘాటుగా స్పందించారు.. ఇవాళ ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.. వైసీపీ త‌ర‌పున తానే అభ్య‌ర్దిగా పోటీ చేస్తాన‌ని త‌న‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.. నీ తెలుగుదేశం కార్యకర్తలే నాకు ఓట్లు వేసి, నిన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. నువ్వు చేసే అవినీతి ప‌నుల‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రోజుకోసారి రాజీనామా చేయాల్సి ఉంటుంద‌ని ఘాటుగా స్పందించారు.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప‌ట్టించుకోని నువ్వా న‌న్ను విమ‌ర్శించేంద‌ని మండిప‌డ్డారు.. వెంకటగిరి మునిసిపాలిటీలో కోట్ల రూపాయలతో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి ప్రజలకు తాగునీరు పరిశుభ్రంగా అందడంలేదన్నారు.. గత రెండు సంవత్సరాల నుండి వెంకటగిరిలో సెంట్రల్ లైటింగ్ విత్ డబుల్ రోడ్ నిర్మిస్తామన్న హామీ ఏమైంద‌న్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో వెంకటగిరి మునిసిపాలిటీ 85వ స్థానంలో ఉందన్నారు..ఎస్.ఎస్. కెనాల్ పనులు పూర్తిగాక మెట్టప్రాంత రైతుల గొంతెండుతుందని విమ‌ర్శించారు.. కృష్ణపట్నం – ఓబుళాపురం రైల్వే పనుల్లో కోట్లరూపాయలు డిమాండ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి మరి నీ భాగోతం బయటపెట్టిన విషయం గుర్తులేదా అని ప్ర‌శ్నించారు..

SHARE