వైసీపీ నేత‌ల‌కు నంద్యాల గెలుపు చెంప‌పెట్టు – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్ర‌సాద్..

39

The bullet news (Vijayawada)-నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విజ‌య‌దుందుభి వైసీపీ నేతల అహంకారానికి చెంపపెట్టు అని ఎమ్మెల్సీ యలమంచిలి వెంకట బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీ పార్టీ విజయం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, అహంకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ అధినేత జగన్ కు నంద్యాల ప్ర‌జ‌లు త‌గిన బుద్ది చెప్పార‌న్నారు.. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ బుద్ది తెచ్చుకోవాల‌న్నారు.. ప్రజల్లో తిరిగెటప్పుడు హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు.. ఎన్నికల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న శిల్పా మాట మీద నిలబడాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా ఉన్నారన్నారు.

SHARE