వైసీపీకి అధికారం ఇస్తే ఇక అంతే..

95

The Bullet News ( Amaravathi)_ వైjagan psychoయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్‌ లాంటి రాక్షసుడు మరొకరు లేరని, జగన్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అడ్డంగా భక్షిస్తారని, ఏపీని బిజెపికి తాకట్టు పెడతారని ఆయన విమర్శించారు. కేవలం 5ఏళ్లలో రూ.లక్ష కోట్లు భక్షించిన జగన్ కంటే రాక్షసుడు ఎవరని యనమల ప్రశ్నించారు. జగన్ తన కేసులు మాఫీ చేయించుకోడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని, ఆ పార్టీ చెప్పిందే చేస్తున్నారని ఆయన విమర్శించారు.

జగన్ లాంటి రాక్షసుడు వస్తే వచ్చేది రాక్షస రాజ్యమేనని యనమల దుయ్యబట్టారు. బిజెపితో కుమ్మక్కై రాష్ట్రానికి నమ్మకద్రోహం చేస్తున్నారన్నారు. కర్ణాటకలో ఖనిజ దొంగ ‘గాలి’ గ్యాంగ్‌కు వైసీపీ పార్టీ ప్రచారం చేయలేదా..? అని యనమల ప్రశ్నించారు. రాక్షస మూకలన్నీ ఏకం అవుతున్నాయని, మాఫియాలన్నీ ఏకం అవుతున్నాయని, ప్రజాధనం దోచుకోవడానికి మళ్లీ సిద్ధం అవుతున్నాయని అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల సూచించారు.
SHARE