ఒక్క ఎక‌రా కూడా ఎండిపోకుండా నీరిస్తాం – వ్య‌వ‌సాయ‌శాఖామంత్రి సోమిరెడ్డి

92

The bullet news (Sarvepalli)- ఏపీ లోటు బ‌డ్జెట్ లో ఉన్నా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ప్ర‌తీ ఒక్క హామీని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చిత్త‌శుద్దితో నెర‌వేరుస్తున్నార‌ని వ్య‌వ‌సాయ‌శాఖామంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ఐదో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో స‌మ‌న్వ‌య‌క‌ర్త సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భంగా ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారంద‌రికీ జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం మంచి వేదిక‌న్నారు.. ఈనెల 11న కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తామ‌న్నారు. హౌసింగ్ లబ్ధిదారుల సమస్యలన్ని త్వ‌రలోనే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఐఏబీ తీర్మానం మేరకు జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామ‌ని ఆయ‌న ఒక్క ఎక‌రా కూడా ఎండిపోకుండా చూసే బాధ్య‌త త‌న‌ద‌న్నారు..

SHARE