కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకే…

99

THE BULLET NEWS (VENKATAGIRI)-కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకే వెంకటగిరి పట్టణంలో ఇల్లు తీసుకున్నానని జడ్పీ ఛైర్మన్, వెంకటగిరి వైసీపీ సమన్వయ కర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు.. ఇవాళ తెల్లవారు జామున వెంకటగిరిలో ఆయన నూతన గృహప్రవేశం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి లో ఉంటూనే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తానన్నారు.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. గృహ ప్రవేశానికి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

SHARE