మా సీఎం డైన‌మిక్ లీడ‌ర్ – మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి

159

The bullet news (Atmakur)_ రాష్టం లోటు బ‌డ్జెట్ లో ఉన్నా ప్ర‌జా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న డైన‌మిక్ లీడ‌ర్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడ‌ని మాజీ మంత్రి, రాష్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలిపారు.. జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ ఆయ‌న రాజ‌వోలు, దూబ‌గుంట‌లో ప‌ర్య‌టించారు.. రాజ‌వోలులో నిర్వ‌హించిన గ్రామ సభలో గర్భవతులకు సీమంతుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.. అనంత‌రం దూబగుంటలో ప‌ర్య‌టించిన ఆనంకు అక్క‌డి నాయ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ 16 వేల కోట్ల రూపాయల లోటుతో ఉన్న రాష్ట్రానికి నేనున్నానంటూ ధైర్యంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్య‌మంత్రి మా నాయ‌కుడ‌ని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు.. ఏపీ ప్ర‌జ‌లు ముఖ్యమంత్రికి తోడ్పాటునందిచాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు భారీగా పాల్గొన్నారు..

SHARE