డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన పనబాక రచన…

267

THE BULLET NEWS – గ్రూప్-1 ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక రచన సత్తా చాటింది.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న విడుదల చేసిన సివిల్ సర్వీస్ గ్రూప్-1 ఫలితాల్లో మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ కూతురు రచన డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి ఎంపిక అయింది..

రచన తండ్రి పనబాక కృష్ణయ్య భారతీయ రైల్వే లో ఉన్నతాధికారిగా పనిచేశారు.. తల్లి లక్ష్మీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వారు కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.. రచన ఉస్మానియా యూనివర్సిటీ లో బిటెక్ పూర్తి చేసింది.. ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో గ్రూప్స్ కి సన్నద్ధం అయింది.. పలువురు రచన ను అభినందించారు.

SHARE