పార్లపల్లిలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి అవమానం…

220

THE BULLET NEWS (VIDAVALUR)-నెల్లూరు జిల్లా విడవలూరు మండలం  దళితతేజం- తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  విడవలూరు మండలం పార్లపల్లి  గ్రామానికి చేరుకున్నారు . ఆరు నెలల క్రితం ఆ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు .ఆ పర్యటనలో ఎమ్మెల్యే కి మహిళలు తమ కాలనీలో చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయంగా మారుతున్నాయని విన్నవించుకున్నారు.ఆ సమయంలో ఎమ్మెల్యే  కాలనీలోని రోడ్లన్నీ సిసి రోడ్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ నెరవేర్చకుండా తమ గ్రామానికి ఎలా వస్తారు అని స్థానిక మహిళలు ఎమ్మెల్యే ని అడ్డుకున్నారు.గ్రామంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

SHARE