పతంజలి సమర్పించు… బాబా సిమ్.. త్వరలో మార్కెట్ లోకి…

104

THE BULLET NEWS – ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో అతి తక్కువ సమయంలోనే కార్పోరేట్ కంపెనీలకు గట్టిపోటి ఇచ్చింది పతంజలి. తక్కువ ధరతో పాటు ఆయుర్వేద సంబంధ ఉత్పత్తులతో వరుసపెట్టి మార్కెట్‌ను హోరెత్తించింది. కొద్దినెలల్లోనే వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంది. కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్‌లో విజయవంతమైన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న పతంజలి.. టెలికాం సెక్టార్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పతంజలి ఇక నుంచి భారతీయ టెలికాం రంగంలోనూ అడుగుపెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం చేసుకుని స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌కార్డులను అతి త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

ఈ సిమ్‌ కార్డు ద్వారా రూ. 144 రిచార్జ్‌తో అపరిమిత కాల్స్‌‌, 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుందని.. అయితే మొదట్లో పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారని ప్రకటించింది. దేశం మొత్తం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ద్వారా పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్స్‌ కూడా పొందవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్‌ఎల్ కౌంటర్ల ద్వారా.. ప్రజలు సిమ్‌కార్డులు పొందవచ్చని పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ తెలిపారు. దీనితో పాటుగా రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆరోగ్య. ప్రమాద, జీవిత బీమాను కూడా అందజేస్తామని ఆయన అన్నారు.

SHARE