గూడూరు స‌మ‌స్య‌లు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే పాశం సునీల్

127

The bullet news (Gudur)_ గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎమ్మెల్యే పాశం సునీల్ ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన రాష్ట్ర టిడిపి వర్క షాపులో పాల్గొన్న ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.. సాధికారత సర్వే ఆధారంగా టీవీ, స్కూటర్, రూ.500 కరెంటు బిల్లు వచ్చిన వారికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్,ఇల్లు,సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని, ఇలా కాకుండా నిజమైన పేదలకు వెసులుబాటు కల్పించాలని కోరారు.. నియోజకవర్గంలో మూడు నెలలలో చేయాల్సిన పనులు..,పెన్షన్లు,ఇళ్ళు,రేషన్ కార్డులను నూరు శాతం అందించాలని విన్న‌వించారు. వేసవి దృష్ట్యా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో,గూడూరు పట్టణంలో నివారణ చర్యలకు రూ.12-కోట్లు మంజూరు చేయాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటితో పాటు నియోజకవర్గంలో సంవత్సరం లోపల చేయాల్సిన పనులు..,స్వర్ణముఖి బ్యారేజీ గేట్లు ఎత్తు పెంచి గూడలి, చిట్టమూరు, కోగిలి వద్ద చెక్ డ్యాంలను నిర్మించి, ఎల్లసిరి, తూపిలి చెరువులను రిజర్వాయర్లుగా మార్చి,తెలుగుగంగ కాలువల అనుసంధానాలను పూర్తిచేయాలనే ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించారు.. దాంతో పాటు నియోజకవర్గంలోని రోడ్డు విస్తరణ పనులకు హై లెవల్-లో లెవల్ బ్రిడ్జీలకు,సెంట్రల్ లైటింగ్ నిర్మాణాలకు రూ.100-కోట్లు అవసరమనితెలిపారు. కోట మండలం పుచ్చలపల్లి-దైవాలదిబ్బ వద్ద రూ.7-కోట్లతో హై లెవల్ బ్రిడ్జీ నిర్మించినట్లైతే మూడు మండలాలను కలిపే గ్రామాలకు సులభంగా రవాణా సౌకర్యం ఏర్పడుతుందని, మత్స్యకార గ్రామాలలో కోల్డ్ స్టోరేజిలను నిర్మించాలని ముఖ్యమంత్రి ని కోరారు..

SHARE