తిరుమలలో పవన్ క్రేజ్…

59

THE BULLET NEWS (TIRUMALA)-జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుమ‌ల వెంక‌న్న స‌న్నిధిలో భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోయారు. శనివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ ఎక్కిన ప‌వ‌న్‌.. సాధాసీదాగా సామాన్య భ‌క్తుడిగా న‌డుచుకుంటూ వెళ్లారు. ఓ పార్టీకి అధినేతై ఉండి.. ఇలా సాధాసీదాగా వెంక‌న్నను ద‌ర్శించుకోవ‌డంపై ప‌వ‌న్ అభిమానులు సంతోష‌ం వ్యక్తం చేస్తున్నారు. మ‌రో రెండు రోజుల పాటు తిరుమ‌ల కొండ‌పైనే గడపనున్నారు ప‌వన్‌ కల్యాణ్‌.

జ‌న‌సేన అధీనేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌నివారం రాత్రి కాలిన‌డ‌క‌న తిరుమల కొండ‌పైకి చేరుకున్నారు. ఆదివారం ఆయ‌న శ్రీవారిని ద‌ర్శికున్నారు. ప‌వ‌న్ సాదాసీదాగా తిరుమ‌ల కొండ‌పైకి వెళ్లడంతో.. అభిమానులు ప‌వ‌న్‌ను క‌లిసి అభివాదం చేశారు. దర్శనం అనంతరం పవన్ ఆలయం వెలుపలకి రాగానే అక్కడికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని వారించడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అభిమానుల తోపులాటల మధ్యే పవన్ కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని రాజకీయాలు మాట్లాడనని పవన్‌ అన్నారు. తనకు అన్నప్రాశన, నామకరణ౦ శ్రీవారి ఆలయంలోని యోగా నరసింహా స్వామి సన్నిధిలోనే జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా పవన్ బస్సు యాత్ర ప్రారంభించే ముందు స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు శ్రీవారి సన్నిధికి వచ్చారు.

కాలిన‌డ‌క మార్గం గుండా ప‌వ‌న్ నడుచుకుంటూ వెళ్తుండగా.. ప‌లువురు సామాన్య భ‌క్తులు ఆయ‌న‌తో ఫోటోలు తీసుకునేందుకు పోటీప‌డ్డారు. తిరుమ‌లకు వ‌చ్చే వీ.ఐ.పీ భ‌క్తుల‌కు ప్రత్యేక ద‌ర్శన సౌక‌ర్యం ఉన్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం 300 రూపాయాల ప్రత్యేక ద‌ర్శన టికెట్ కొనుగోలు చేసి స్వామీ వారిని ద‌ర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు పవన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. కొండ‌పై మరో రెండు రోజులు బస చేయనున్న పవన్‌కల్యాణ్ మ‌రికొన్ని పుణ్యక్షేత్రాల‌ను ద‌ర్శించుకోనున్నారు.

SHARE