పవన్‌ కల్యాణ్‌ అభిమాని ఆత్మహత్య

101

The bullet news(kavali)-పట్టణంలోని సబ్‌కోర్టు వీధిలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసుపులేటి నరేంద్ర (24) అనే పవన్‌ కల్యాణ్‌ అభిమాని  సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం తాళ్లపాళెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన నరేంద్ర కావలి పట్టణ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అవివాహితుడైన నరేంద్ర ప్రేమించిన యువతి వ్యవహారంలో మనస్థాపం చెంది నాలుగు రోజులుగా మద్యం తాగుతూ సన్నిహితుల వద్ద తన ప్రేమ విఫలంపై ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

తాను ప్రేమించిన యువతిని ఇంటికి తీసుకువస్తానని తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ విషయాన్ని బాబాయ్‌కి చెప్పగా, ఆయన మీ నాన్నాతో నేను మాట్లాడుతాను, ఎక్కడున్నవో చెప్పు అని నరేంద్రను ఫోన్‌లో ప్రశ్నించాడు. ఎందుకులే బాబాయ్‌… అని సమాధానం చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయాడు.   ఈ క్రమంలో సోమవారం ముసునూరు దాటిన తర్వాత చెంచుగానిపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్‌పై ఎదురుగా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రామచంద్రాపురం గ్రామంలో విషాదం అలముకొంది.

SHARE