పవన్ కళ్యాణ్ మద్దతు మాకే.. – వైసీపీ ఎంపీ వరప్రసాద్

39

The bullet news (Delhi)- పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన పార్టీ జగన్‌తోనే ఉంటుందని వైకాపా ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంలో జనసేన, వైకాపా పరస్పర మద్దతుతోనే పోరాటం చేస్తాయని తెలిపారు. ఎన్నికల తర్వాత జగన్‌కు అవసరమైతే జనసేన ఎమ్మెల్యేల మద్దతు ఇస్తానని పవన్‌ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

‘ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేస్తే కలవడానికి వెళ్లా. ఈ సందర్భంగా వైకాపా తనపై విమర్శలు ఎందుకు చేస్తోందని ఆయన నన్ను అడిగారు. మా పార్టీని అవినీతి పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. పోలవరం సందర్శనకు మేము వెళ్తున్నామని తెలిసి మాకంటే ముందే మీరు వెళ్లారు. దీనికి తోడు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని విమర్శిస్తున్నాం అని చెప్పాను. తాను తెదేపాతో ఎంతమాత్రం లేనని.. అవసరమైతే జగన్‌కే మద్దతిస్తామని పవన్‌ చెప్పారు’ అని వరప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.

SHARE