రైతుల గొంతుకోస్తున్న ప్రభుత్వం

106

THE BULLET NEWS (KODAVALUR)- నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం లో పెన్నా డెల్టా ఆయకట్టు రైతుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి ,జిల్లా రైతు సంఘం జనరల్ సెక్రటరీ బెజవాడ గోవిందరెడ్డి,కొడవలూరు జెడ్పిటిసి ఇరువూరు శ్రీధర్ రెడ్డి  పలువురు రైతు సంఘం నాయకులు ,రైతులు పాల్గొన్నారు. గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రెండో పంటకు అందించవలసిన నీరు హక్కు గత వంద సంవత్సరాల నుంచి ఉంది . రెండో కారులో సుమారు లక్షా యాభై వేల ఎకరాలు పంట పండాల్సి ఉంది . కానీ అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి నీరు లేదు అని చెబుతున్నారు . రైతు సంఘం అధ్యక్షులు  సుమారుగా ఒక్కొక్కరు రెండు కోట్ల రూపాయల మేర పనులు సిద్ధంగా ఉన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నారు . ఈ పనుల వల్ల రైతులకు లాభమేమీ లేదు అధ్యక్షులు జోగులు నిండేందుకు ఈ పనులు . జిల్లాలో ఉండే రైతులందరూ కలిసి రైతుల కోసం పోరాడాలే తప్ప ఏ రాజకీయ పార్టీలు రైతుల కోసం పోరాడారు. అధికారులు నాయకులు ఈ రోజు ఉంటారు పోతారు . మన హక్కులను మనమే కాపాడుకోవాలి . మనకు రావలసిన  నీరు మనకిస్తే రెండో పంట సుమారు లక్ష్య  యాభై వేల ఎకరాలు  సాగుచేసుకోవచ్చు.   రైతులందరూ కలిసి కోర్టుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది . మన హక్కులను మనమే కాపాడుకుందాం అని ఆయన ప్రస్తావించారు.

SHARE