బీజేపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. – పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

124

THE BULLET NEWS (NELLORE)-నోట్ల రద్దు, జిఎస్టీ, మహిళలపై అత్యాచారాలు, దేశం ఆర్ధికంగా వెనకపడిపోవడం వంటి కారణాలతో ప్రజలు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.. నెల్లూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.. కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్స్ గెలవబోతోందన్నారు.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు..సీఎం సిద్దా రామయ్యపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉందన్నారు..పరస్పర ఒప్పందంతో జేడీఎస్, బీజేపీ సహకరించుకుంటున్నారని ఆయన ఆరోపించారు..జేడీఎస్ ను బీజేపీనే ఆపరేట్ చేస్తోందన్న రఘువీరా… బీజేపీ నుంచే ఆ పార్టీకి ఫండింగ్ వెళ్తుందన్నారు.. దేశంలో రెండు వేల రూపాయల నోట్లు అమిత్ షా చేతుల్లోకి చేరిపోయాయని వాటిని కర్ణాటకలో పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు..2019 లో రాహుల్ గాంధీ ప్రధానిగా ఎర్రకోట పై జెండా ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు..

SHARE