చంద్ర‌బాబు ఛీట‌ర్ అని ప్ర‌జ‌లే అంటున్నారు – స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి

89

The bullet news (Servepalli)- “పెద్ద‌య్యా.. అదైర్య ప‌డొద్దు.. కొన్ని నెల‌లు ఓపిక ప‌ట్టు..నీ మ‌న‌మ‌డు అధికారంలోకి వ‌స్తాడు.. నెల‌నెలా రూ.2000 ఫించ‌న్ ఇస్తాడు.. 2019లో అధికారం మ‌న‌దేనంటూ” వైసీపీ నెల్లూరుజిల్లా అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే గోవర్ద‌న్ రెడ్డి ఓ వృద్దుడికి భ‌రోసా ఇచ్చారు.. మనుబోలు మండలం యాచవరంలో వై.యస్.ఆర్. కుటుంబం కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు..ఈ సంద‌ర్భంగా స్థానిక‌ యువ‌త, నేత‌లు ఆయ‌న‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు..ఇంటింటికి వెళ్లిన ఆయ‌న వైఎస్సార్ హయాంలో జ‌రిగిన అభివృద్ది ప‌నులు వివ‌రించారు. కర‌ప‌త్రాలు పంపిణీ చేశారు..
న‌వ‌ర‌త్నాల ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట ప్ర‌జ‌లు ఏం చేయాల‌నుకుంటున్నారో తెలిపారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌న్నారు.. ఏ ఇంటింటికి వెళ్లినా చంద్ర‌బాబు నాయ‌డు ఛీట‌ర్ అంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నార‌న్నారు.. 2019లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఆద‌రించేందుకు, సీఎం చేసేందుకు అంద‌రూ సిద్దంగా ఉన్నార‌న్నారు.. టీడీపీ ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌లేద‌న్న ఆయ‌న ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌జ‌ల్లోకి వస్తున్న నాయ‌కుల్ని చొక్కా ప‌ట్టుకుని ఏఏ హామీలు అమ‌లు చేశారో అడ‌గాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నేత‌లు, యువ‌త పాల్గొన్నారు..

SHARE