THE BULLET NEWS(KRISHNA DISTRICT)-గణ‌నాథుని ఆశీస్సుల‌తో రాష్ట ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.. ఉయ్యూరులోని 2వ వార్డులో నవ యువత & యువసేన ఆధ్వర్యంలో నిర్వ‌హించిన గణేష్ నిమజ్జన ఊరేగింపును ఎమ్మెల్సీ కొబ్బరికాయ కొట్టి ప్రారంబించారు. అంత‌కు ముందు వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ న‌వ్యాంధ్ర అభివృద్ది కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న చంద్ర‌బాబు నాయుడికి వినాయ‌కుడి ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ఆయ‌న కోరుకున్నారు.. త‌మ ప్రాంత ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో నేత‌లు కాగిత శివ, పడమట వెంకటేశ్వరరావు , దుర్గారావు, శ్రీకాంత్ , ఓగిరాల నాగభూషణం పాల్గొన్నారు

SHARE