ప్ర‌జ‌లు జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్నికోరుకుంటున్నారు – గూడూరు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య క‌ర్త మేరిగ ముర‌ళీ

179

The bullet news (Gudur)- “చంద్రబాబు పాలనకు చరమగీతం పాడుదాం… వైఎస్సార్ కుటుంబం లో చేరండి… జగన్ ని ఆశీర్వదించండి” అంటూ గూడూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త మెరిగ మురళిధర్ పిలుపునిచ్చారు.. ఇవాళ గూడూరు లోని 28 వ వార్డు లో సీనియర్ నాయకులు శ్రీ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తో కలిసి ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ స్టిక్కర్స్ అంటించారు.. మహిళలతో, యువకులతో మాట్లాడారు.. నవరత్నాల గురించి వివరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన పై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు.. అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.. 2019 లో జగన్ అధికారంలోకి తీసుకురావటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, మైనారిటీ విభాగం పట్టణ అద్యక్షుడు జహీర్, అధికార ప్రతినిధి నాశిన నాగులు, వైసీపీ గూడూరు మండల అధ్యక్షులు మల్లు విజయ కుమార్ రెడ్డి, మెట్ట రాధా రెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, మోహిద్దీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

SHARE