తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం- మంత్రి సోమిరెడ్డి

43

The bullet news (Nellore)_  నెల్లూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆర్ డ‌బ్ల్యూస్ అధికారుల‌తో స‌మీక్షా సమావేశం నిర్వహించారు.. అనంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ త్వరలోనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.. రాష్ట్రానికి రూ.1,5730 కోట్లు, జిల్లాకు రూ.1,640 కోట్లు నిధులు మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ అయిందని ఆయన తెలిపారు.. మరో వారంలో సోమశిల, కండలేరు నుంచి నీటి కేటాయింపులపై సంబంధిత అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు..ప్రతి ఇంటికీ కుళాయి, ప్రతి వ్యక్తికి 70 లీటర్ల ఆరోగ్యకరమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా మహత్తరమైన పథకాన్నిపంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ రూపొందించారన్నారు. నెల్లూరు జిల్లాలోని చిన్నచిన్న పల్లెలతో కలిపి 3,046 గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర తీరప్రాంతాల్లో ఉప్పు నీరు, పడమటి పల్లెల్లో ఫ్లోరైడ్ సమస్యకు కూడా పరిష్కారం చూపుతామన్నారు..ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ పాశం సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్సీ శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఇంతియాజ్ గారు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు పాల్గొన్నారు..

SHARE