మర్రిపాడు గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ కిషోర్ ను ఘనంగా సన్మానించిన సిబ్బంది..

101

The bullet news (Marripadu) – నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తూ.. అన్ని వేళలలో వారికి అందుబాటులో ఉంటున్న మంచి వ్యక్తి డాక్టర్ కిషోర్ అని మర్రిపాడు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. ఆగస్టు 15న ఉత్తమ ప్రతిభాపురస్కారం అందుకున్నడాక్టర్ కిషోర్ ను, కంప్యూటర్ ఆపరేటర్ నారాయణ రెడ్డిలను హాస్పటల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. హాస్పటల్ లో ఆవరణంలోనే నివాసముంటూ మర్రిపాడు మండలంలోని రోగులకు సకాలంలో డాక్టర్ కిషోర్ మెరుగైన వైద్యం అందిస్తున్నారని సిబ్బంది అభినందించారు..రికార్డులను, రిపోర్టులను సకాలంలో ఉన్నతాధికారులకు పంపుతూ కంప్యూటర్ ఆపరేటర్ నారాయణ రెడ్డి సేవలు అభినందనీయమన్నారు..

SHARE