మంత్రి సోమిరెడ్డిపై పొద‌ల‌కూరు స‌ర్పంచ్ నిర్మ‌ల‌మ్మ పైర్

87

The bullet News (Podalakuru)- వ్య‌వ‌సాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిపై మ‌హిళా సర్పంచ్ మండిపడ్డారు.. పార్టీ మార‌లేద‌నే క‌క్ష‌తోనే చెక్ ప‌వ‌ర్ ను మంత్రి ర‌ద్దు చేశార‌ని ఆరోపించారు.. పొద‌ల‌కూరులో మీడియాతో మాట్లాడిన ఆమె సోమిరెడ్డి తీరుపై ధ్వ‌జ‌మెత్తారు.. త‌న‌ను పార్టీకిలో మంత్రి ఆహ్వానించినా వైసీపీని వ‌దిలి వెళ్ల‌క‌పోవ‌డంతోనే త‌న చెక్ ప‌వ‌ర్ ను ర‌ద్దు చేశార‌న్నారు.. దళిత స‌ర్పంచ్ అని కూడా చూడ‌కుండా వేదింపుల‌కు గురిచేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. తెలుగుదేశం ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య విలువ‌ను కాలరాస్తోంద‌ని మండిప‌డ్డారు.. పార్టీ మార‌ని స‌ర్పంచ్ ల‌పై చెక్ ప‌వ‌ర్ పేరుతో వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు.. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ఆమె స‌వాల్ విసిరారు.. ఈ కార్యక్ర‌మంలో పొద‌ల‌కూరు మండ‌ల నాయ‌కులు పాల్గోన్నారు.

SHARE