మీరందరూ నావాళ్ళు…- పార్టీ లో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే కాకణి వ్యాఖ్య

109

THE BULLET NEWS (PODALAKUR)-మీరందరూ నా కుటుంబ సభ్యులు.. నా అభివ్రుద్దికి తోడ్పాటునందించారు.. మీరందరూ మళ్లీ నా వెన్నంటే ఉండేందుకు వచ్చారు.. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను.. మీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటానంటూ… టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కుటుంబాలను, కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు..

ఇవాళ పొదలకూరు పంచాయతీ పరిధిలోని దాదాపు 40 కుటుంబాలు సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి ఆద్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలో చేరిన వారందరూ వ్యక్తిగతంగా తనకు,తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారన్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కలిసి
పనిచేశామన్న ఆయన.. కొన్ని బేధాభిప్రాయాల వల్ల దూరమయ్యామన్నారు..వీరందరూ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.. మళ్లీ ఓడిపోతానని గ్రహించిన మంత్రి సోమిరెడ్డి ఇప్పటి నుంచే జిమ్మిక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు.. మూడుసార్లు నియోజకవర్గ ప్రజలు ఛీకొట్టినా.. బుద్దిరాలేదన్నారు..

SHARE