గూడూరు జంట‌హ‌త్య‌ల కేసును ఛేదించిన పోలీసులు

117

The bullet news (Gudur)_నెల్లూరుజిల్లా గూడూరులోని ఇందిరానగర్ లో ఇటీవ‌ల జరిగిన జంట‌హత్య‌ల కేసును గూడూరు వ‌న్ టౌన్ పోలీసులు ఛేదించారు.. ప్రతికారంగానే హత్యలు జరిగినట్లు నిర్దారించారు.. 16 మందిని అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద నుంచి హ‌త్య‌కు ఉప‌యోగించిన మార‌ణాయుధాల‌ను , రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను గూడూరు డిఎస్పీ రాంబాబు మీడియాకు వివ‌రించారు..

ఐదు నెల‌ల క్రితం గూడూరుకు చెందిన డేగా నారాయ‌ణ అనే వ్య‌క్తిని డేగా చిన్న జ‌య‌రామ‌య్య‌, పెద్ద జ‌య‌రామ‌య్య మరో ముగ్గురు క‌లిసి హ‌త్య చేశారు. .ఈ కేసులు ఆ ఐదు మంది నిందితులు జైలు జీవితం అనుభిస్తూ ప్ర‌స్తుం బెయిల్ పై బ‌య‌ట తిరుతున్నారు.. డేగా నారాయ‌ణ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకునేందుకు అత‌ని కుటుంబ స‌భ్యులు ప‌థ‌కం ప‌న్నారు.. ఎలాగైనా చిన్న జ‌య‌రామ‌య్య‌, పెద్ద జ‌య‌రామ‌య్య‌ల‌ను అంత‌మొందించేందుకు ప‌క్కా ప్లానేశారు. జైలు జీవితం అనంత‌రం నిందితులిద్ద‌రూ విద్యాన‌గ‌ర్ కి మ‌కాం మార్చారు.. ఈ నెల 9న గూడూరులోని ఇందిరాన‌గ‌ర్ కు రాగానే డేగా నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు దాదాపు 19 మంది ఒకే సారి అటాక్ చేశారు.. మార‌ణాయుధాల‌తో తెగ‌బ‌డ్డారు.. క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడులకు దిగారు.. దీంతో డేగా చిన్న జ‌య‌రామ‌య్య‌, పెద్ద జ‌య‌రామ‌య్య అక్క‌డిక్క‌డే మృతిచెందారు.. కేసు న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించిన పోలీసులు ఇవాళ 19 మంది నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.. మ‌రో ముగ్గురు ప‌రారీలో ఉన్నారు.. ఈ స‌మావేశంలో సిఐ, ఎస్ ఐలు పాల్గొన్నారు..

SHARE