ఆత్మకూరులో సినీ ఫక్కీలో పోలీసుల చేజింగ్…..

192

నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీ చేస్తూ ఉండగా ఓ కారు కడప జిల్లా నుండి నెల్లూరు వైపుకు వస్తూ ఉండగా వాహన తనిఖీలు చేస్తున్న మర్రిపాడు పోలీసులను చూసి ఆపకుండా నెల్లూరు వైపు వేగంగా వెళ్ళిపోయింది.. దీంతో ఇక్కడి పోలీసులు ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని ఆత్మకూరు పోలీసులు నెల్లూరు పాలెం వద్ద కారును ఆపే ప్రయత్నం చేయగా కారు సడన్ గా రివర్స్ చేసుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది… ఆత్మకూరు ఎస్ ఐ సంతోష్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో పోలీసు వాహనంలో కారును వెంబడించగా 7 కిలోమీటర్లు కారును పోలీసులు చేజింగ్ చేసిన అనంతరం జాతీయ రహదారిపై కారును వదిలి గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు..కారు నడిపే వాళ్ళు పోలీసులను చూసి ఎందుకు పరారయ్యారు. ఆ కారులో ఎవరున్నారు. కారును నడిరోడ్డుపై వదిలేసి ఎందుకు వెళ్లిపోయారు.ఆ కారులో ఏముంది అంటూ అర్థంకాని గందరగోళం నెలకొంది. రివర్స్ చేసుకుని వెళ్ళిపోయిన కారును పోలీసులు వెంబడించడంతో ఆత్మకూరు మండలం నారం పేట క్రాస్ రోడ్ సమీపంలో కారును వదిలి దుండగులు పారిపోవడంతో.కారును స్వాధీనం చేసుకున్న ఆత్మకూరు ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డి.. కారును పోలీస్ స్టేషన్ కు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నరు