సాగునీటి పంపిణీలో కూడా రాజకీయ జోక్యమా – కాకాణి పైర్

87

The Bullet news ( Sarvepalli ) – ” సాగునీటి పంపిణీలో కూడా రాజకీయం జోక్యం జరుగుతోంది.. వైసీపీకి చెందిన రైతులను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు..నీటి విడుదలలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలుంటాయి” అంటూ వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు.. ఇవాళ సర్వేపల్లి రిజర్వాయర్ ను తిరుపతి ఎంపీతో కలిసి ఎమ్మెల్యే కాకాణి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సోమశిలలో నీరు సమ్రుద్దిగా ఉన్నందును చివరి ఆయకట్టువరకు నీరందేలా ఇరిగేషన్ అధికారులు చూడాలన్నారు.. నీటి సంఘాల అధ్యక్షులును గతంలో రైతులే ఎంపిక చేసుకునేవారని.. కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాల అధ్యక్షుల ఎంపికలోనూ రాజకీయం జరుగుతోందని మండిపడ్డారు.. వైసీపీకి మెజార్టీ ఉన్న గ్రామాలకు చెందిన రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమన్నారు.. ఇలాంటి కుట్రలను పూర్తిగా అడ్డుకుని రైతులకు బాసటగా నిలబడతామన్నారు.

SHARE