ప్రారంభమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్…

91

THE BULLET NEWS (BANGALORE)-దేశం మొత్తం రసవత్తరంగా ఎదురుచూస్తున్న కన్నడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 222 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరుగుతుంది. నకిలీ ఓటర్‌ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్‌ఆర్‌ నగర్‌ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది. మే 28న రాజరాజశ్వరినగర్‌(ఆర్‌ఆర్‌ నగర్‌) అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.

2600 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే రోజు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల్లో కన్నడ ఓటరు ఎవరికి పట్టం కడతాడో తేలే రోజు. ఎన్నికలో భాగంగా 55,600 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 4.96 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించనున్నారు.  ఎన్నికల పోలింగ్‌ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామిల నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల కౌటింగ్‌ ఈ నెల15న నిర్వహించి ఫలితాన్ని తెలియజేస్తారు.

SHARE