నిరుపేద‌లు సంక్రాంతిని సంతోషంగా జ‌రుపుకోవాలి – నిత్య‌వ‌స‌ర స‌రుకులు పంపిణీ చేసిన సింహ‌పురి యూత్ అసోసియేష‌న్ నాయ‌కులు

100

The bullet news (Venkata Giri)_  సంక్రాంతి పండుగ‌ను నిరుపేద‌, మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబాలు సంతోషంగా జ‌రుపుకోవాల‌నే ఉద్దేశ్యంతోనే ఉప్పు- పప్పు కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు సింహ‌పురి యూత్ అసోసియేష‌న్ నాయ‌కులు ఉద‌య్ కుమార్, ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.. ఉజ్వల సేవా సమితి మరియు సింహపురి యూత్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇవాళ వెంక‌ట‌గిరిలోని ఆరో వార్డులో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. నిరుపేద కుటుంబాల‌కు నిత్య‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు.. ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ నాయ‌కులు మాట్లాడుతూ సంక్రాంతిని అంద‌రూ సంతోషంగా జ‌రుపుకోవాల‌నే ఉద్దేశ్యంతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు వెంకటెశ్వర్లు, కలపాటి బాలు, తెక్షత్ కుమార్, మోహన్, దినేష్, వంశీ, చిన్న మరియు ఎన్టీఆర్ కాల‌నీ వాసులు పాల్గొన్నారు..

SHARE