నెల్లూరు పంట పొలాల్లో పోర్న్ స్టార్ ఫ్లెక్సీలు..

205

The bullet news ( Nellore )_

తన అందచందాలతో అభిమానులను ఉరుతలూగించి,నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే ఆ శృంగార తార రైతుల పంటలను కాపాడుతుంది.. పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆ భామ పంటపొలాల్లో సందడి చేస్తోంది.. తన గ్లామర్ డోస్ తో కుర్రకారునే కాదు.. రైతులను సైతం కట్టిపడేస్తోంది.. పంటపొలాల్లో ఆ పోర్న్ స్టార్ పోస్టర్లు దర్శనమిస్తుండటంతో అశ్చర్య పోవడం అటుగా వెళ్లేవారి వంతవుతోంది.. పంట పొలాల్లో ఉండే పోర్న్ బ్యూటి ఎవరు..? పొలాల్లో పోస్టర్లు ఎందుకు ఉన్నాయి..? వీటన్నిటికీ పర్ఫెక్ట్ సమాధానం దొరకాలంటే ఈ స్ట్రోరీ చూడాల్సిందే…

నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని పంట పొలాల్లో సన్నీలియోన్
హాట్ హాట్ ఫోజులతో ఉండే ప్లెక్సీలు కనిపిస్తున్నాయి.. పోస్టర్లులో పోర్న్ భామ సన్నిలియోన్ సందడి చేస్తోంది.. పచ్చని పైర్లకు దిష్టి తగలకుండా రైతులు ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. పాతకాలంలో ఉండే నరదిష్టికి నాపరాయి అయినా పగులుతుందన్న సామెతను బాగా ఒంట పట్టించుకున్న రైతులు తమ పంటను నరదిష్టి నుంచి కాపాడుకునేందుకు ఈ ఏర్పాటు చేశారు..

శృంగారగార తారగా ఉన్న సన్నిలియోన్ తమ పంట పొలాలలను నరదిష్టి నుంచి కాపాడుతోందని నెల్లూరు జిల్లా రైతులు చెబుతున్నారు.. సన్నిలియోన్ తో పాటు మాటలతో మత్తెక్కించే యాంకరమ్మ అనుసూయ పోస్టర్లు సైతం పొలాల్లో దర్శనమిస్తున్నాయి.. దీంతో పంటను చూడకుండా అటుగా వెళ్లే వారు పోస్టర్లను చూస్తూ ఆశ్చర్యపడుతున్నారు. ఆత్మకూరు, నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ, జొన్నవాడ, ఉదయగిరి మండలంలోని బండగానిపల్లి, కోవూరు మండలం పాటూరు, గెుమ్మళ్ల దిబ్బ తదితర ప్రాంత రైతులు వినూత్నంగా ఆలోచించి ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు..

నరదిష్టి నుంచి తమ పంటను కాపాడి అధిక దిగుబడి వచ్చేందుకు ఈ పోస్టర్లు ఉపయోగపడు తున్నాయంటున్నారు జిల్లా రైతులు..

SHARE