అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం -మంత్రి కె.ఎస్.జవహర్

43

THE BULLET NEWS (KOVVUR) -పల్లెసీమలే ప్రగతికి పట్టుగొమ్మలన్న మహాత్మాగాంధీ మాటలను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పిలుపునిచ్చారు. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలోని నెలటూరు, ఊనగట్ల, నందిగంపాడు గ్రామాల్లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.16వేల కోట్లు ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో
సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయడం హర్షనీయమన్నారు. దీనిలో భాగంగానే కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.774 కోట్లు వెచ్చించామన్నారు. ఇదే తరహలో రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అందించి సంతృప్తి పరుస్తామన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగానికి రూ.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. అనంతరం మండలంలోని 4 గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్నా,
సర్పంచులు ఊబా దుర్గ,మెరిపో ఫణీంధ్ర, నందిగం వెంకట్రావు, రేలంగి సత్యవతి,ఎంపీపీ కోడూరి రమామణి, తెదేపా నాయకులు ఆళ్ల హరిబాబు,తాళ్లూరి ప్రసాద్,కోడూరి ప్రసాద్,
నందిగం హరినాథ్, తెలుగు యువత నాయకులు బొల్లిన నాగేంద్ర, మనెల్లి నాని పలువురు నాయకులు పాల్గొన్నారు.

SHARE