బాంబే హైవేపై ఘోర ప్రమాదం… అక్కడిక్కడే ఇద్దరు మృతి…

148

THE BULLET NEWS (KOVUR):- నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాళ్ళెం బాంబే జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నుండి నెల్లూరు వేలే రోడ్డు పై ఆగివున్న లారీని వేగంగా వస్తున్న బైక్ అదుపు తప్పి లారీ ని ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తుండగా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మృతులు ప్రయాణిస్తున్న బైక్ నిన్నటి రోజున నెల్లూరు నాలుగో నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ధోగలించినట్టు ఓ వ్యక్తి పిర్యాదు చేసారు.

మృతుల వద్ద గంజాయి, బ్లెడ్ ఉండటంతో వారు దొంగలు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బీహార్ కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

SHARE