గూడూరులో సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ దాష్టికం..

292

The bullet news ( GUDUR) _ “విద్యార్దులను మేము ఇలాగే ట్రీట్ చేస్తాం.. కాలేజీ బాత్ రూమ్ లు శుభ్రపరుచకుంటే కొట్టమా..? మేం చెప్పినట్లు వినకపోతే చావగొడతాం.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ గూడూరులోని సెయింట్ మేరీస్ కాలేజీ కరస్పాండెంట్ విమల జ్యోతి ఏబీవీపి నాయకులు మీద చిందులు తొక్కింది”. కాలేజీ బాతురూమ్ లు శుభ్రపరచలేదంటూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మల్లి కావేరీ అనే విద్యార్దినీని చావబాది కాలేజీ నుంచి గెంటేశారు..

చిల్లకూరు మండలం ఉడతావారిపాలెం వడ్డికండ్రికకు చెందిన మల్లి కావేరి గూడూరు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.. విద్యార్దినీలు చేత కాలేజీ మరుగుదొడ్లను శుభ్రం చేయించేవారు.. ఇవాళ కావేరీ
వంతు రావడంతో ఆ విద్యార్దిని శుభ్రపరిచేందుకు నిరాకరించింది.. రేపు పరీక్షలున్నాయని చదువుకోవాలని చెప్పడంతో ప్రిన్సిపాల్ సిస్టర్ ప్లోరా విద్యార్దినీని చావబాదింది.. పరీక్ష ఎలా రాస్తావో చూస్తానంటూ కాలేజీ నుంచి గేంటేసింది.. దీంతో కావేరీ తల్లిదండ్రులకు సమాచారవ్వడంతో తల్లిదండ్రులొచ్చి కరస్పాండెంట్, ప్రిన్పిపాల్ తో మాట్లాడినా ససేమీరా అన్నారు.. విషయం
తెలుసుకున్న ఏబీవీపి నాయకులు కాలేజీలోకి ప్రవేశించడంతో వారిపైనా కరస్పాండెంట్ చిందులు తొక్కింది.. దీంతో కాలేజీ ఎదుట నిరసన తెలిపినా ఏబీవీపి నాయకులు విద్యార్దినీతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.. టుటౌన్ పోలీసులు కేసు
నమోదు చేశారు..

SHARE