THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు జిల్లా సాలుచింతల సెంటర్ వద్ద ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పడగొట్టిన ఇళ్లను సందర్శించిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్.ఇళ్లను కూలదోసి పది రోజులయినప్పటికీ వారికి ప్రత్యామ్నాయం చూపకపోవడం దారుణమైన సంఘటన . పక్కనే  ఉన్న   ఇల్లు కోవూరు అధికార పార్టీకి సంబంధించినవి కాబట్టి పగలగోట్టిన రెండో రోజే వారికి పట్టాలు అందజేశారు . ఇవి నెల్లూరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కాబట్టి పది రోజులైనప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమైన ఘటన .పేదవారు  ఏ పార్టీకి చెందిన వారైనా పేదవారే .

మంత్రి నారాయణ ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన కాలేజీలు అధికారులకు  కనపడవా.మంత్రి నారాయణ నిర్మించిన కాలేజీల్లో ఆక్రమణలు లేవా. నిరూపించేందుకు నేను సిద్ధం. అధికారులు  వచ్చేందుకు ధైర్యం లేదు. మంత్రి కోక చట్టం పేదలకు ఒక చట్టమా అని నిలదీసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్.

నెల్లూరు ఎమ్మార్వో గారికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో  నాలుగు ఎకరాల డేబై ఐదు సెంట్లు పోరంబోకు భూమి ఉందని చెప్పాము.కానీ ఎమ్మార్వో గారు ఆ భూమిని వేరే వారికి కేటాయించామని చెబుతున్నారు .అది ఇప్పటికీ కూడా పోరంబోకు భూమిగా అడంగళ్ కాపీల్లో  ఉంది.

దీనిపై మేము కలెక్టర్ గారిని కలిసి పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో ప్రభుత్వ పోరంబోకు భూమి నాలుగు ఎకరాల డేబై ఐదు సెంట్లు ఉందని సమాచారం    ఇచ్చాము .దీనికి కలెక్టర్ గారు వెంటనే స్పందించి బాధితులకు తగు న్యాయం చేస్తామని చెప్పారు.

మాకు కలెక్టర్ గారిపై గౌరవం ఉంది .ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు  న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం .

SHARE