విశ్వనాథుని సేవలో….శివైక్యం…

120

THE BULLET NEWS (WEST GODAVARI)-సుమారు 40 ఏళ్లపాటు పరమ శివుడి సేవలోనే తరించిన ఓ అర్చకుడు ఆలయ గర్భగుడిలో పూజ చేస్తూనే శివలింగంపై ఒరిగిపోయారు. కొన ఊపిరితో ఉన్నఆయనను పక్కనున్న పూజారులు బయటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే ప్రాణం విడిచారు. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దేవాలయ అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. అర్చకుడు కందుకూరి రామారావు శివలింగంపై పడిపోయిన విషయాన్ని గుర్తించారు. పంచారామ క్షేత్రమైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. అర్చకుడు శివలింగం పానవట్టంపై పడిపోయారని, గర్భగుడిలో శివైక్యం చెందలేదని ఆలయ చైర్మన్ వేగేశ్న రంగరాజు తెలిపారు.

SHARE