The bullet news ( Vijayawada) _ హీరో మహేష్‌బాబు బెజవాడలో సందడి చేశాడు. బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్‌లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వీక్షించారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా విజయోత్సవానికి వచ్చానని, రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాల జోలికి వెళ్లనని మహేష్‌బాబు ఘంటాపథంగా చెప్పారు.

ఆంధ్రా హాస్పిటల్స్, ఇంగ్లండ్‌కు చెందిన లిటిల్ హెవెన్స్ ఆధ్వర్యంలో 300 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులను మహేష్‌బాబు కలిశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్న మహేష్‌బాబు పిలుపునిచ్చారు. రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్‌బాబు సహకారం అందిస్తున్నారని, మహేష్‌బాబు స్వగ్రామం బుర్రిపాలెంలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. చిన్న పిల్లల ఆపరేషన్లపై షార్ట్‌ఫిల్మ్‌ తీసేందుకు మహేష్‌ అంగీకరించారని ఆంధ్రా హాస్పిటల్ చీఫ్‌ పిడియాట్రిషియన్ రామారావు వెల్లడించారు.

SHARE