గూడూరులో బ‌రితెగించిన ప్ర‌యివేట్ కాలేజీలు

52

The bullet news (Gudur)_ గూడూరులో ప్రయివేట్ కాలేజీల అధ్యాపకులు బరితెగించారు.. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేశ్చగా మాస్ కాపియింగ్ జరుగుతోంది.. ప్రయివేట్, కార్పోరేట్ అద్యాపకులు, ప్రిన్సిపాలే స్వయంగా రంగంలోకి దిగి తమ కాలేజీ విద్యార్లులు పాసయ్యేందుకు నానా కష్టాలు పడుతున్నారు.. విద్యార్దులు పరీక్షా కేంద్రంలో ప్రయోగాలు చేస్తుంటే అందుకు సంబంధించిన స్లిప్స్ ను అధ్యాపకులు బయటి నుంచి అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న గూడూరు ఏబీవీపి శాఖ రంగంలోకి దిగి వారి పోటోలను చిత్రీకరించింది.. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రయివేట్, కార్పోరేట్ కాలేజీలు బరితెగించి ప్రవర్తిస్తున్నాయన్నారు.. కాలేజీల్లో ల్యాబ్ప్ లేకపోవడం, విద్యార్దుల చేత ప్రయోగాలు చే్పించెకపోవడంతో ఇప్పుడు వారిని పాస్ చేయించేందుకు అద్యాపకులు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీల్లో ల్యాబ్స్ ఉన్నట్లుయితే ఈ దుస్థితి ఉండేది కాదన్నారు. మాస్ కాఫియింగ్ కు అద్యాపకులే ప్రోత్సాహించడం సిగ్గుచేటన్నారు.. కాఫియింగ్ కు పాల్పడుతున్న కాలేజీలపై,అందుకు సహరిస్తున్న అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని మనోజ్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారులు ప్రయివేట్ కాలేజీలు ఇచ్చే ముడుపులకు అలవాటు పడి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

SHARE