The bullet news (Kakinada)- నాడు నంద్యాల‌.. నేడు కాకినాడ.. ప్రాంతాలు మారాయి త‌ప్ప ఫ‌లితాలు మాత్రం అవే పున‌రావృతం అయ్యాయి.. కాకినాడ కార్పోరేష‌న్ లో సైకిల్ దూసుకెళ్లింది.. నంద్యాల ఫలితాల అనంతరం జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. 48 డివిజ‌న్ల‌కు జ‌రిగిన ఈ ఎన్నికలో టీడీపీ అభ్య‌ర్దులు దూసుకెళ్లారు. 48 డివిజన్లకు గానూ.. టీడీపీ 32 డివిజన్లను కైవసం చేసుకుని మరోసారి ఎదురులేదని నిరూపించుకుంది. ప్రతిపక్ష వైసీపీ అన్ని స్థానాలకు పోటీ చేసి 10 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ మిత్ర పక్షం బీజేపీ 3 స్థానాల్లో గెలిచింది. ముగ్గురు ఇండిపెండెట్ అభ్యర్థులు గెలుపొందారు. నంద్యాల విజయం టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపితే.. కాకినాడ కార్పొరేషన్ గెలుపు ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది.

వైసీపీ పరిస్థితి మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో తీవ్రంగా కుదేలైన వైసీపీ శ్రేణులను కాకినాడ ఫలితం మరింత కలవరానికి గురి చేసింది. 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో కూడా ఈ మాదిరి ఫలితాలే పునరావృతమైతే పార్టీ భవిష్యత్ ఏంటనే ప్రశ్న వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికార తెలుగుదేశం మాత్రం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీటవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదీ కాకినాడ ఫలితాల అనంతరం ప్రధాన పార్టీల పరిస్థితి. కాకినాడలో డివిజన్ల వారీగా గెలుపొందిన అభ్యర్థుల జాబితా ఇది…

టీడీపీ గెలిచిన డివిజన్లు.. గెలుపొందిన అభ్యర్థుల జాబితా

1వ డివిజన్‌లో పేరాబత్తుల లోవబాబు (టీడీపీ) విజయం
2వ డివిజన్‌లో సత్తిబాబు (టీడీపీ) విజయం
3వ డివిజన్‌ బత్తుల అచ్చియమ్మ (టీడీపీ) విజయం
6వ డివిజన్‌లో బండి సత్యనారాయణ (టీడీపీ) గెలుపు
7వ డివిజన్‌లో అంబటి క్రాంతి (టీడీపీ) విజయం
8వ డివిజన్‌లో అడ్లూరి వరలక్ష్మి (టీడీపీ) విజయం
10వ డివిజన్‌లో మోస దానమ్మ (టీడీపీ) విజయం
11వ డివిజన్‌లో గద్దేపల్లి దానమ్మ (టీడీపీ) విజయం
12వ డివిజన్‌లో తుమ్మల సునీత (టీడీపీ) విజయం
13వ డివిజన్‌లో వొమ్మి బాలాజి (టీడీపీ) విజయం
14వ డివిజన్‌లో ఉమా శంకర్ (టీడీపీ) విజయం
16వ డివిజన్‌లో మల్లాడి గంగాధర్‌ (టీడీపీ) విజయం
17వ డివిజన్‌లో సత్యప్రసాద్‌ (టీడీపీ) గెలుపు
18వ డివిజన్‌లో చవ్వాకుల రాంబాబు (టీడీపీ) విజయం
19వ డివిజన్‌లో పలివెల అనంత్‌కుమార్‌ (టీడీపీ) విజయం
20వ డివిజన్‌లో సత్యనారాయణ (టీడీపీ) గెలుపు

25వ డివిజన్‌లో కె.సీత (టీడీపీ) విజయం
26వ డివిజన్‌లో సంగాని నందం (టీడీపీ) గెలుపు
27వ డివిజన్‌లో రాజాన మంగారత్నం (టీడీపీ) విజయం
28వ డివిజన్‌లో సుంకర పావని (టీడీపీ) విజయం
31వ డివిజన్‌లో బంగారు సూర్యావతి (టీడీపీ) గెలుపు
33వ డివిజన్‌లో గుచ్చి దుర్గ (టీడీపీ) విజయం
34వ డివిజన్‌లో తహేరా ఖాతూర్‌ (టీడీపీ) విజయం
37వ డివిజన్‌లో లంకె హేమలత (టీడీపీ) గెలుపు
38వ డివిజన్‌లో శేషుకుమారి (టీడీపీ) విజయం
40వ డివిజన్‌లో సుంకర శివ ప్రసన్న (టీడీపీ) విజయం
43వ డివిజన్‌లో పవన్‌ కుమార్‌ (టీడీపీ) విజయం
46వ డివిజన్‌లో బాలప్రసాద్‌ (టీడీపీ) విజయం
49వ డివిజన్‌లో పాలిక ఉషారాణి (టీడీపీ) గెలుపు
29వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి రామచందర్‌రావు విజయం
35వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి బలువూరి రామకృష్ణ విజయం
39వ డివిజన్‌లో టీడీపీ రెబల్‌ అభ్యర్థి నాగసూర్య దీపిక గెలుపు
39వ డివిజన్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి గెలుపు

బీజేపీ గెలిచిన డివిజన్లు.. గెలుపొందిన అభ్యర్థుల జాబితా

5వ డివిజన్‌లో నల్లబెల్లి సుజాత (బీజేపీ) విజయం
36వ డివిజన్‌లో లక్ష్మీప్రసన్న (బీజేపీ) విజయం
41వ డివిజన్‌లో సత్యవతి (బీజేపీ) గెలుపు

వైసీపీ గెలిచిన డివిజన్లు.. గెలుపొందిన అభ్యర్థుల జాబితా

4వ డివిజన్‌లో పలకా సూర్యకుమారి (వైసీపీ) గెలుపు
9వ డివిజన్‌లో కంపర రమేష్‌ (వైసీపీ) విజయం
15వ డివిజన్‌లో సత్తిబాబు (వైసీపీ) గెలుపు
21వ డివిజన్‌లో బుర్రా విజయకుమారి (వైసీపీ) విజయం
22వ డివిజన్‌లో కిశోర్‌కుమార్‌ (వైసీపీ) విజయం
23వ డివిజన్‌లో మీసాల శ్రీదేవి (వైసీపీ) విజయం
24వ డివిజన్‌లో మీసాల ఉదయ్‌కుమార్‌ (వైసీపీ) గెలుపు
30వ డివిజన్‌లో చంద్రకళా దీపిక (వైసీపీ) గెలుపు
32వ డివిజన్‌లో రోకళ్ల సత్యనారాయణ (వైసీపీ) గెలుపు
47వ డివిజన్‌లో వెంకటలక్ష్మి (వైసీపీ) గెలుపు

గెలిచిన ఇండిపెండెట్ అభ్యర్థులు వీళ్లే

35వ డివిజన్‌లో బి.రామకృష్ణ
29వ డివిజన్‌లో వాసిరెడ్డి రాంబాబు

SHARE