నెల్లూరు జిల్లాలో జంట పై ఉన్మాది దాడి..

200

THE BULLET NEWS (TADA)-జిల్లాలోని తడ మండలం అక్కంపేట రైల్వేస్టేషన్ దగ్గర దారుణం చోటు చేసుకుంది.. స్టేషన్ లో కూర్చుని ఉన్న ఓ జంట పై ఉన్మాది దాడి చేశాడు.. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్మాది ఒడిశా రాష్ట్రానికి చెందిన అజయ్‌కుమార్‌ గా తెలుస్తుంది..

తడ మండలం మాంబట్టు లోని ఓ సెజ్ లో సంగం మండలానికి చెందిన మహేశ్వర్ ఉదయగిరి ప్రాంతానికి చెందిన అక్తర్ తో సహజీవనం చేస్తుంది.. నెల్లూరు నుంచి వారిద్దరూ రైలు ఎక్కి సుళ్లురుపేట రైల్వేస్టేషన్ లో దిగారు.. ఇవాళ ఉదయం అక్కంపేట స్టేషన్ లో మహేశ్వర, అఖ్తర్ కూర్చుని ఉండగా ఓ ఉన్మాది వారి పై దాడి చేశాడు.. వారి వద్ద నున్న నగలు, నగదు లాక్కెళ్లాడు.. యువతి పై దాడి చెయ్యబోతుండగా వారు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడకు చేరుకుని సైకోని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా… అజయ్‌కుమార్‌ పలు చోరీ కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు.

SHARE