THE BULLET NEWS (KOVUR)-

* పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్న అజ్ణాత సైకో..

* నెల్లూరుజిల్లా కోవూరులో సైకో కలకలం.

* అర్ద‌రాత్రి సైకో వీధుల్లో హ‌ల్ చ‌ల్..

* కోవూరు ప్రాంతంలోని కాపువీధిలో సంచరించినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడి.

* స్థానికులు ప‌ట్టుకోబోగా ప‌రారీ

* సైకోను ప‌ట్టుకునేందుకు రాత్రంగా జాగారం చేసిన కోవూరు వాసులు.

* నిన్నటిరాత్రి 11 మందిపై దాడి.

* ఒకమహిళపై అత్యాచారం చేసిన సైకో.

* ఊహాచిత్రాన్ని విడుదలచేసిన పొలీసులు .

నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం స్రుష్టిస్తున్నాడు..కోవూరులో అయిదు చోట్ల మహిళలపై దాడులు చేస్తూ దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు.. ఓ వ్రుద్దురాలిగా అత్యాచారం చేసిన అజ్ణాత సైకో మరో
వ్రుద్దమహిళపై దాడికి తెగబడ్డాడు.. పోలీసులురంగంలోకి దిగి గస్గీలు నిర్వహిస్తున్న అజ్నాత సైకో మాత్రం యధేశ్చగా తిరుగుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు.. పట్టుకోండి చూద్దాం అన్నట్లు కోవూరు వాసులకు ముచ్చెమటలు
పట్టిస్తున్నాడు..

గత మూడు రోజులుగా కోవూరులో అజ్ణాత సైకో సంచరిస్తున్నాడు. .అర్దరాత్రులు ఇంటింటికి
తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతున్నాడు.. రెండు రోజుల క్రితం ఓ యాబై ఏళ్ల వ్రుద్ద మహిళలపై అత్యాచారానికి తెగబడ్డాడు.. మరో మహిళపై దాడికి పాల్పడ్డాడు.. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి డాగ్ స్వాడ్ ను రంగంలోకి దింపినా ఫలితం కనిపించలేదు.. సాక్షాత్యు ఎస్పీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాదితులతో మాట్లాడాడు. .అయినా తెల్లవారుజామున మరోసారి ప్రజలకు చుక్కులు చూపించాడు.. ఈ తెల్లావారుజామున మరో వ్రుద్దుడిపై దాడి చేశాడు..

సైకోలు వీరంగం చేసిన సంఘటనలతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. పట్టపగలు
ఇళ్లలో నుంచి బయటికి రావాలన్నా భయంతో భీతిల్లిపోతున్నారు. ఎస్పీ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.భయాందోళనలో ఇంటికి తాళాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు స్తానికులు.. కోవూరులోని శ్మశాన వాటిక,రైల్వే రోడ్డు, చెరువుకట్ట సమీప ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కమర్షియల్ విషయాల్లో దూకుడుగా వ్యవహరించే ఎస్ఐ వెంట్రావ్ ఈ వ్యవహారంలో పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని కోవూరు వాసులు మండిపడుతున్నారు.. తనకు లాభం చేకూరే విషయాల్లో మాత్రమే కోవూరు ఎస్ ఐ
పనిచేస్తాడని ప్రజలకు ఉపయోగపడే విషయాల్లో మాత్రం చూసీచూడటనట్లు వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..

SHARE