పూలే దంపతుల సేవలు అభినందనీయం…

102

THE BULLET NEWS (NELLORE)-బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పూలే దంపతుల చేసిన కృషి అభినందనీయమని సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య కొనియాడారు.. పూలే జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని ఆయన కార్యాలయంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు.. ప్రతి మండలంలో ఎస్సి, ఎస్టీ, బిసి వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్నారు.. అలాగే ప్రతి మండలంలో పూలే దంపతుల విగ్రహాలను ఏర్పాటు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు..ప్రతి గ్రామంలో ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు..

SHARE