పంచ్ కు పంచ్…

117

The Bullet News (Nellore)-  న‌న్ను గెలిపించిన ప్ర‌జ‌ల కోసం ఎంత‌దూరమైనా వెళ్తా… అవినీతి అక్ర‌మాల‌కు ఎవ్వ‌రూ పాల్ప‌డినా ఊపేక్షించను.. నేను అవినీతికి ఆమ‌డ దూరం.. నా క‌ళ్ల‌ముందు అవినీతి జ‌రిగితే ఊరుకోను ప్ర‌స‌క్తే లేదు.. ప్ర‌జ‌లే నాకు అండ‌గా.. అంటూ ఓ ఎమ్మెల్యే మంత్రి వ్యాఖ్యల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.. ఒకే చోట ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకోవ‌డంతో అక్క‌డ కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.. ఇంత‌కీ పంచ్ ల‌కు రివ‌ర్స్ పంచ్ లు వేసిన ఎమ్మెల్యే ఎవ‌రు..? ఆ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కామెంట్స్ ఏంటి..? వాచ్ దిస్ స్టోరీ..

స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డేస్తే భ‌గ్గుమంటుంద‌నే విష‌యం జిల్లాతో పాటు రాష్ట ప్ర‌జ‌ల‌కు కూడా బాగా తెలుసు.. కానీ వారిద్ద‌రూ ఒకే చోట కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తే ఆ టెన్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో నిన్న పొద‌ల‌కూరు మండ‌ల వాసుల‌కు, కార్య‌కర్త‌ల‌కు, పోలీసుల‌కు బాగా అర్ద‌మైంది.. ప్ర‌త్యేక ప్రజా విజ్ణ‌ప్తుల దినంలో కాకాణి పాల్గొని ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రిస్తున్నారు..ఇదే స‌మ‌యంలో మంత్రి సోమ‌రెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సైతం అదే ప్రాంగ‌ణ‌లో ప్రజా విజ్ణ‌ప్తుల కార్య‌క్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కాకాణిపై ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు.. అభివృద్దిని అడ్డుకుంటున్నార‌ని, త‌న‌కు ఆస్తులున్నాయంటూ ఆరోప‌ణ‌లు చేసిన వారిని వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని విమ‌ర్శించారు.. దీంతో కాకాణికి అరికాళ్లోమండింది.. ఘాటుగా స్పందించిన కాకాణి త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని, పేద‌ల‌కు న్యాయం జ‌రిగేందుకు ఎంత దూర‌మైనా వెళ్తాన‌ని మండిప‌డ్డారు.. దొడ్డిదారిన మంత్రి అయిన వారికి ప్ర‌జా స‌మస్య‌లు ఎలా తెలుస్తాయ‌ని ఆయ‌న తీవ్ర స్వ‌రంగా మండిప‌డ్డారు.. ఒక‌రికి ఇచ్చిన ప‌ట్టాల‌ను త‌న రాజ‌కీయ ల‌బ్ది కోసం వేరే వారికి కేటాయిస్తుంటే కోర్టుకు వెళ్లాన‌న్నారు.. కోర్టు మొట్టికాయ‌లు వేసినా ప్ర‌బుత్వానికి సిగ్గురాలేద‌న్నారు.. కాకాణి స్వ‌రం పెంచి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతుండ‌టంతో కొంత దూరంలో వేదిక‌పై నున్న మంత్రి వింటూ ఉండిపోయారు.. కాకాణి స్వంత మండ‌లం కావ‌డంతో కాకాణికి మ‌ద్దతుగా వంద‌ల మంది కార్య‌క‌ర్త‌లు ప్ర‌దేశానికి చేరుకున్నారు..

SHARE